![సైబర్‌నేరాలపై జాగ్రత్తగా ఉండాలి : ఏఎస్పీ మహేందర్](https://static.v6velugu.com/uploads/2025/02/medak-district-asp-mahender-warns-students-about-cyber-crimes_3kRCDvuHsm.jpg)
- మెదక్ జిల్లా ఏఎస్పీ మహేందర్
మెదక్ టౌన్, వెలుగు : విద్యార్థులు సైబర్ నేరాలపై ఎంతో జాగ్రత్తగా ఉండటంతోపాటు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు కూడా అవగాహన కల్పించాలని మెదక్ జిల్లా ఏఎస్పీ మహేందర్ అన్నారు. బుధవారం సైబర్ జాగృతి దివస్‌ను పురస్కరించుకొని సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో మెదక్ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, బాలికల జూనియర్ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సైబర్ నేరాలు జరిగే విధానం గూర్చి వివరించారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు గుర్తించిన వెంటనే టోల్‌ఫ్రీ 1930కి, https://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు చేయాలని డీఎస్పీ సూచించారు. కార్యక్రమంలో మెదక్ టౌన్ సీఐ నాగరాజు, ప్రిన్సిపాల్ తారాసింగ్, సైబర్ క్రైమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.