
- మెడికల్ కాలేజీ రాకతో టీవీవీపీ నుంచి డీఎంఈ పరిధిలోకి మార్పు
మెదక్, వెలుగు: ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి టీచింగ్ హాస్పిటల్ గా మారింది. మెదక్ పట్టణంలో కొత్తగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్ ) డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఏంఈ) లో విలీనమైంది.
మెడికల్ కాలేజీ ప్రారంభంతో..
అవసరమైన మౌలిక వసతులు సమకూర్చి ప్రపోజల్స్ పంపగా మెదక్‌లో 50 సీట్లతో గవర్నమెంట్మెడికల్ కాలేజీ ఏర్పాటుకు గత సెప్టెంబర్‌లో నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) నుంచి పర్మిషన్ లభించింది. ఈ మేరకు డైరెక్టర్ఆఫ్మెడికల్ఎడ్యుకేషన్(డీఎంఈ) ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ నిర్వహణకు ప్రిన్సిపాల్‌ను నియమించడంతో పాటు, ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌కు బోధించేందుకు అవసరమైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ప్రొఫెసర్లు, ఇతర డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్ నియామకాలు చేపట్టారు. ఎన్ఎంసీ గైడ్ లైన్స్‌ప్రకారం130 బెడ్స్కెపాసిటీ ఉన్న ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, 100 బెడ్స్కెపాసిటీ గల మాతా శిశు సంరక్షణ కేంద్రంతో పాటు కొత్తగా నిర్మిస్తున్న 50 బెడ్స్ కెపాసిటీ గల క్రిటికల్ కేర్ సెంటర్‌ను మెడికల్ కాలేజీకి అనుసంధానించారు.
పూర్తయిన విలీన ప్రక్రియ
మెడికల్ కాలేజీ ప్రారంభమైన నేపథ్యంలో డీఎంఈ ఆదేశాల మేరకు టీవీవీపీ పరిధిలో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, ఏంసీహెచ్ను డీఎంఈలో విలీనం చేశారు. ఇటీవల ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. దీంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో, ఎంసీహెచ్‌లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది వారి వారి హోదాలకు అనుగుణంగా టీవీవీపీ పరిధిలోని ఇతర ఆస్పత్రులకు వెళ్లనున్నారు.
ఇకనుంచి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, ఎంసీహెచ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పర్యవేక్షణలో కొనసాగుతాయి. ఆయా ఆస్పత్రుల్లో మెడికల్‌కాలేజీకి సంబంధించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ప్రొఫెసర్లు, డాక్టర్ల ఆధ్వర్యంలో వైద్యసేవలు అందుతాయి.