
మునిపల్లి, వెలుగు : పల్లెల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తూ ఎంతగానో కృషి చేస్తోందని జడ్పీటీసీ పైతర మీనాక్షి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో సర్పంచ్ రమేశ్ఆధ్వర్యంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఇటీవల కానిస్టేబుళ్లుగా ఎంపికైన యువకులను సన్మానించారు. అలాగే యువతకు క్రీడా సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో విజయకుమార్ , శివశంకర్, నర్సింలు, వీరన్న, నవీన్, కార్యదర్శి రాజ్ కుమార్ పాల్గొన్నారు.