టాలీవుడ్ ప్రముఖ స్వర్గీయ నటుడు అక్కినేని నాగేశ్వర రావు జ్ఞాపకార్థం నిర్వహించే ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ 2024 వేడుకల్ని అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ నందు ఘనంగా నిర్వహించారు. అయితే ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తోపాటూ టాలీవుడ్ సినీ పరిశ్రమకి చెందిన సినీ నిర్మాతలు, హీరోలు, డైరెక్టర్లు తదితరులు హాజరయ్యారు.
ALSO READ | ANR National Award 2024: ఐసీయూలో ఉండగా ఏఎన్నార్ చివరి మెసేజ్.. వింటే కన్నీళ్ళాగవు..
అయితే ఈ ఏడాది టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ దక్కింది. దీంతో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చిరంజీవి ని దుశ్శాలువాతో సత్కరించి ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ అందించారు.