చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడు అరెస్ట్​

చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడు అరెస్ట్​

మెహిదీపట్నం, వెలుగు: చైన్​స్నాచింగ్​కేసులో నిందితుడిని అరెస్ట్​చేసినట్లు డీసీపీ చంద్రమోహన్​తెలిపారు. శుక్రవారం సాయంత్రం సౌత్ అండ్ వెస్ట్ జోన్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన ముమ్మిడి మోహన్ రెడ్డి ఈ నెల 26న మెహదీపట్నంలో తన బంధువు అంత్యక్రియలకు బయలుదేరాడు. మెహదీపట్నం బస్టాప్ వద్ద బస్సు దిగుతుండగా అతని  మెడలోని చైన్​ను గుర్తు తెలియని వ్యక్తి లాక్కొని, పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. 

మల్లేపల్లి మంగర్ బస్తీకి చెందిన లక్ష్మణ్ రాథోడ్ గురువారం రాత్రి విజయనగర్ కాలనీలో బంగారు చైన్లు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా.. అనుమానంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో 3 దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు.  మూడున్నర తులాల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకొని, లక్ష్మణ్​రాథోడ్​ను అరెస్ట్​చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. హూమాయున్ నగర్ సీఐ మల్లేశ్, సిబ్బంది ఉన్నారు.