గత కొన్ని రోజులుగా డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు చేస్తుంది. బ్లెడ్ బ్యాంకులు, మెడికల్ షాపులు, ఫార్మా కంపెనీలతో సహాలు పలు సంస్థలపై దాడు చేసింది. ఇవాళ ఏకకాలంలో రెండు జిల్లాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు రైడ్స్ చేశారు. హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో డీసీఏ అధికారులు సోదాలు చేసి పలు కాస్మోటిక్స్, హెయిర్ ఆయిల్స్ వంటివి సీజ్ చేశారు.
హైదరాబాద్ లోని జియోగుడాలో ఇల్లిగల్ గా తయారీ చేస్తున్న కాస్మొటిక్స్ స్థావరంపై రైడ్ చేశారు. నాగ్రిస్ హెర్బ్స్ అనే సంస్థ లైసెన్స్ లేకుండా పకీజా గోల్డ్ మెహందీ కోన్, పాకీజా ఆర్ట్ హెన్నా, పాకీజా ఫాస్ట్ ఆర్ట్ హెన్నా ఇన్‌స్టంట్ కోన్, పాకీజా ప్యూరిఫైడ్ వంటి బ్రాండ్ పేర్లతో మెహందీ కోన్స్ (హెన్నా పేస్ట్), హెన్నా పౌడర్‌లను ఉత్పత్తి చేస్తుందని పక్కా సమాచారం రావడంతో అధికారులు తనిఖీ నిర్వహించారు. కంపెనీకు లైసెన్స్ లేదని అధికారులు గుర్తించి హెన్నా పౌడర్ కాస్మెటిక్ అన్నింటిని సీజ్ చేశారు.
మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా డీసీఏ అధికారులు రైడ్ చేశారు. మూర్ఛ చికిత్స కోసం తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తూ జాడీ బూటీ నరిషింగ్ హెయిర్ ఆయిల్ ను తనిఖీ చేశారు. అక్కడ ఉన్న వాటిని సీజ్ చేశారు. జడ్చర్లలో బెల్లాకేర్ సిరప్ తో స్త్రీలకు చికిత్స చేస్తున్నందుకు తనిఖీ చేసిన అధికారులు తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినందుకు సీజ్ చేశారు.