ఏపీలో 16 మంది ఐపీఎస్ లకు మెమోలు

హెడ్ క్వార్టర్ లో అందుబాటులో లేకపోవడమే కారణం
జారీ చేసిన డీఐజీ ద్వారకా తిరుమలరావు

అమరావతి: హెడ్ క్వార్టర్ అందుబాటులో ఉండని 16 మంది వెయిటింగ్ ఐపీఎస్ లకు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు మెమోలు జారీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న డీజీ ర్యాంకు అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, సునీల్ కుమార్ సహా 16 మంది ఐపీఎస్ అధికారులకు మెమో జారీ అయ్యాయి.

యిటింగ్ లో  సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా టాటా, కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని, రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరా రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణ కాంత్ పటేల్, పాలరాజులకు డీజీపీ  మెమో జారీ చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశించారు. విధులు ముగిశాక అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లాలని స్పష్టం చేశారు.