- వేగవంతమైన జర్నీతోపాటు వినోదాన్ని అందిస్తోన్న మెట్రో
- వీకెండ్స్‌లో అమీర్‌పేట మెట్రో స్టేషన్లో స్పెషల్ ఈవెంట్స్, కాన్సర్ట్స్
- స్పేస్ ఎక్కువున్న ఇతర స్టేషన్లలోనూ నిర్వహణ
- అలసిపోయిన ప్రయాణికును రీఫ్రెష్ చేసేలా సెలబ్రేషన్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు : ప్రయాణికులను వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుస్తున్న మెట్రో వినోదాన్ని కూడా అందిస్తోంది. ఆఫీసులు, కాలేజీల నుంచి అలసిపోయి వచ్చే ప్రయాణికుల్లో జోష్ నింపేందుకు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మెట్రో మెలోడీస్, మెట్రో ఫెస్ట్, మెట్రో రెట్రో, మెట్రో మెడ్లీ పేరుతో వీకెండ్స్‌లో సెలబ్రేషన్స్, ఈవెంట్స్, క్యాంప్స్, బుక్ఫెయిర్స్ప్లాన్చేస్తోంది. ఇవే కాకుండా ప్రత్యేక రోజుల్లో, పండుగల సందర్భంగా బతుకమ్మ, రంగోలి, దాండియా, క్రిస్మస్సెలబ్రేషన్స్నిర్వహిస్తోంది.
వీకెండ్ వచ్చిందంటే చాలు మెట్రోస్టేషన్లు ఆటలు, పాటలతో కళకళలాడుతున్నాయి. జోష్‌నింపే కార్యక్రమాలే కాకుండా సామాజిక అవగాహన పెంచేలా అనారోగ్య సమస్యలు, మూర్ఛ, బ్లడ్, ఆర్గాన్డొనేషన్పై అవేర్నెస్కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్పెషల్ఈవెంట్లు, ప్రోగ్రామ్స్‌కు మహిళలు, యూత్, ఐటీ ఎంప్లాయీస్బాగా కనెక్ట్అవుతున్నారు. మెట్రోలో రోజూ సగటున ఐదు లక్షలకుపైగా జనాలు ప్రయాణిస్తుండగా, ఈ సంఖ్యను ఏడు లక్షలకు చేర్చాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా ప్రయాణికులను ఆకర్షించడానికి టికెట్లపై ఆఫర్లను ప్రకటించడంతో పాటు ఇలాంటి వినూత్న కార్యక్రమాలు ప్లాన్చేస్తున్నారు.
అమీర్ పేట జంక్షన్ వద్ద..
అమీర్‌పేట మెట్రోస్టేషన్.. రెడ్, బ్లూ లైన్లను కలిపే జంక్షన్కావడంతో స్టేషన్కాంకోర్స్(టికెటింగ్ ఏరియా)లో విశాలమైన ప్రదేశం ఉంది. దీంతో మెట్రోకు సంబంధించిన ప్రతి అధికారిక కార్యక్రమాన్ని ఇక్కడే నిర్వహిస్తున్నారు. రెట్రో పేరుతో ర్యాంప్వాక్ఫర్ఏ కాజ్అంటూ ఆర్గాన్ డొనేషన్‌పై, ఎపిలెప్సీ(మూర్ఛ వ్యాధి) అవేర్నెస్ప్రోగ్రామ్, పవర్సేవింగ్, ఎర్త్ అవర్, మదర్స్ డే సందర్భంగా అమ్మ గొప్పతనాన్ని తెలిపేలా సాండ్ ఆర్ట్, పిల్లలకు డ్రాయింగ్ కాంపిటీషన్లు, ఒగ్గు కథ ఇలా రకరకాల కార్యక్రమాలకు వేదికైంది. ఒక్క అమీర్‌పేట స్టేషన్నుంచి రోజూ రెండు లక్షల మంది జర్నీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎక్కువ ఈవెంట్లు ప్లాన్చేస్తున్నారు.
మిగతా స్టేషన్లలోనూ..
అమీర్‌పేట స్టేషనే కాకుండా మిగతా స్టేషన్లలోనూ మెట్రో అధికారులు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువతలోని క్రియేవిటీ, ఇన్నోవేషన్‌ను ప్రదర్శించేందుకు ఇటీవల ‘టీ వర్క్స్’ ఆధ్వర్యంలో ‘మేక్ఇట్ మెట్రో’ పేరిట ఎంజీబీఎస్మెట్రోస్టేషన్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
అదే ఎంజీబీఎస్స్టేషన్లో ‘కితాబ్లవర్స్’ పేరుతో బుక్ఫెయిర్నిర్వహించారు. వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా ‘మెట్రో మెడ్లీ’ పేరుతో అమీర్‌పేట, దిల్సుఖ్నగర్, హైటెక్ సిటీ, కూకట్పల్లి, ఎంజీబీఎస్, పరేడ్ గ్రౌండ్స్, ఉప్పల్మెట్రో స్టేషన్లలో మ్యూజిక్ఫెస్ట్ నిర్వహించారు. తాజాగా ‘వైబ్ ట్రైబ్’ పేరుతో అమీర్‌పేట స్టేషన్ లో మ్యూజిక్, ర్యాప్, పొయెట్రీకి సంబంధించిన ఈవెంట్లు నిర్వహించారు.