ఫేమస్ డ్యాన్సర్, నటుడు మైఖేల్ జాక్సన్ తొలిసారిగా తన సిగ్నేచర్ మూన్‌వాక్ డ్యాన్స్ ను ప్రదర్శించే ముందు ధరించిన టోపీని సెప్టెంబర్ 26న ప్యారిస్‌లో వేలం చేశారు. 77,640 యూరోలకు అంటే ఇండియన్ కరెన్సీలో రూ.68లక్షల 22వేలకు పైనే అమ్ముడుపోయింది. బ్లాక్ ఫెడోరా హోటల్ డ్రౌట్ ముందు అంచనా వేసినట్టే ఈ టోపీ రూ.53 నుంచి 89లక్షల మధ్య అమ్ముడైంది. ఇది దాదాపు 200 రాక్ మెమోరాబిలియా వస్తువులలో ఇది ఒకటి. అయినప్పటికీ అప్పట్లో జాక్సన్ వస్తువులకు సంబంధించి కొన్ని నకిలీల అమ్మకం వెలుగులోకి రావడంతో అసలు వస్తువలకు వాల్యూ అమాంతం పడిపోయింది.
Also Read : ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు
మైఖేల్ జాక్సన్ 1983లో టెలివిజన్ మోటౌన్ సంగీత కచేరీలో డ్యాన్స్ చేసే సమయంలో తన టోపీని వేదిక వైపుకు విసిరాడు. ఆడమ్ కెల్లీ అనే వ్యక్తి జాక్సన్ టోపీని తీసుకున్నాడు. అతని సిబ్బంది దాన్ని తీసుకోవడానికి తిరిగి వస్తారని అతను భావించాడు.. కానీ ఎవరూ రాలేదు. తాజాగా అదే టోపీ ఇప్పుడు వేలంలో అమ్ముడుపోయింది.