సుగుణాలు మనిషికి ఉత్తమమార్గం చూపుతాయి... మంత్రి కొండా సురేఖ

మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవమైన మిలాద్ ఉన్ నబీ పండుగ (సెప్టెంబర్ 16) ను పురస్కరించుకుని మంత్రి సురేఖ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త చెప్పిన శాంతి, సౌభ్రాతృత్వం, కరుణ, ధార్మిక  చింతన, దాతృత్వం, సర్వమానవ సమానత్వం అనే సుగుణాలు మనిషిని ఉత్తమమార్గంలో పయనించేలా దారి చూపుతాయని సురేఖ అన్నారు.

Also Read :-  ఖైరతాబాద్​ బడా గణపతి దర్శనంలో .. ఇబ్బంది పడుతున్న మహిళలు, వృద్దులు

పవిత్ర హృదయంతో కూడిన ప్రతి మనిషికి ఈ భూమి యావత్తు ప్రార్థనాస్థలమేనన్న మహమ్మద్ ప్రవక్త మాటలు స్ఫూర్తిదాయకమైనవని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ అన్నారు.  గంగా జమున సంస్కృతికి నిదర్శనంగా నిలిచే తెలంగాణ రాష్ట్రంలో లౌకిక స్ఫూర్తి పరిఢవిల్లేలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తన కృషిని సదా కొనసాగిస్తుందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు అల్లా దయ ప్రజల పై వుండాలని మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు.