మక్తల్, వెలుగు: మక్తల్పట్టణంలో శ్రీపడమటి అంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో సోమవారం సాయంత్రం పాల ఉట్ల కార్యక్రమం వైభవంగా జరిగింది. సాయంత్రం రాంలీల మైదానంలో సంగెపురాళ్ల పోటీలను ఆలయ కమిటీ సభ్యులు హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ప్రాణేషచారీ, అరవింద చారీ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాల ఉట్లను కోట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు.
ఘనంగా పడమటి అంజన్న పల్లకీ సేవా
ఊట్కూర్, వెలుగు: మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలో శ్రీ పడమటి అంజన్న స్వామికి ఆదివారం రాత్రి ఆలయ ప్రధాన అర్చకులు నరసింహ చారి జోషి, రవికుమార్ జోషి, వేణు గోపాల్ జోషి, నాగరాజ్ చారి స్వామివారికి పల్లకి సేవ, సోమవారం చక్రస్నానం నిర్వహించి బ్రహ్మోత్సవాలు ముగించారు. స్వామి వారిని పల్లకిలో ప్రతిష్ఠించి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ భజన మండలి భజనలు చేశారు. ఆలయ ప్రాంగణమంతా హనుమన్నామస్మరణ, రామ నామ జపంతో మార్మోగింది. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు దొరోల్ల కృష్ణయ్య, మహేశ్ గౌడ్, అరుణ, భూపాల్ రెడ్డి, రామాంజనేయులు, సుధాకర్ రెడ్డి, పొర్ల దత్తప్ప, గోవింద్ రెడ్డి, తిరుపతి, నాగిరెడ్డి, పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.