వర్గీకరణ ఏ కులానికీ వ్యతిరేకం కాదు : దామోదర

వర్గీకరణ ఏ కులానికీ వ్యతిరేకం కాదు : దామోదర
  • అందరికీ న్యాయం చేసేందుకే సర్కారు యత్నం: దామోదర   

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ అనేది ఏ కులానికీ వ్యతిరేకం కాదని, అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నించిందని మంత్రి దామోదర రాజనర్సింహా స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ రిపోర్టుపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ వర్గీకరణతో ఏ కులానికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. ఎవరూ విమర్శించలేని విధంగా వన్​మాన్ కమిషన్ పారదర్శకంగా నివేదిక అందించిందన్నారు.

సుప్రీంకోర్టు జడ్జిమెంట్​కు అనుగుణంగా, స్పష్టంగానే కమిషన్ వర్గీకరణ చేసిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 14 నెలలకే చరిత్ర తిరగరాస్తున్నామని అన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రోజే సీఎం ప్రకటన చేయడంతో పాటు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ కమిట్​మెంట్ అని తెలిపారు. అందరికీ న్యాయం, అందరికీ ఫలాలు అందాలన్న లక్ష్యంతోనే వర్గీకరణ జరిగిందన్నారు.