విద్యా, వైద్య రంగాలకు సీఎం పెద్దపీట

సీఎం కేసీఆర్ నాయకత్వంలో వరంగల్ ను హెల్త్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 1,100 కోట్లతో దేశంలోనే అతిపెద్ద హాస్పిటల్ వరంగల్ లో ఏర్పాటు కాబోతుందన్నారు. ఎంజీఎంలో సమస్యలు పరిష్కరించామని...ఇప్పుడు దానినీ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. మంత్రి హరీష్ రావు చొరవతో రూ.2.14 కోట్ల తో కొత్త సీటీ స్కాన్ మెషిన్ ఏర్పాటు చేశామన్నారు. ఎమర్జెన్సీ వింగ్ లో సత్వర చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మోకాళ్ళ నొప్పులతో బాధ పడేవారికి ఉచితంగా ఆపరేషన్లు జరుగుతున్నాయని తెలిపారు.పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యా, వైద్య రంగాల్లో తెలంగాణ ప్రథమ స్థానలో ఉందని చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. సీఎం కేసిఆర్ వేల కోట్ల నిధులతో ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు. వరంగల్ ను హెల్త్ హబ్ గా తీర్చిదిద్దుతున్నారు.

మరిన్ని వార్తల కోసం

త్రిముఖ వ్యూహంతో పోరుకు సై

కేసీఆర్​ వెనక్కి రావడంపై సందేహాలు !