ఆఫీసుల్లో కాకా జయంతి నిర్వహించాలి: కలెక్టర్

ఆఫీసుల్లో కాకా జయంతి నిర్వహించాలి: కలెక్టర్

హైదరాబాద్ సిటీ, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) జయంతిని జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో నేడు అధికారికంగా నిర్వహించాలని హైదరాబాద్ కలెక్టర్​అనుదీప్​ఆదేశించారు. కాకా ఫొటోకు నివాళులర్పించాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా అధికారులకు, హైదరాబాద్, సికింద్రాబాద్ ఆర్డీఓలు, తహసీల్దార్లకు ఉత్తర్వులు జారీ చేశారు.