రాష్ట్ర ప్రభుత్వంపై ఢిల్లీలో ఎలా కామెంట్ చేస్తారు?

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం రాజ్ భవన్ ను అవమానించిందటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి జగదీశ్ రెడ్డి తప్పుబట్టారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం గురించి గవర్నర్.. ఢిల్లీలో కామెంట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాల్లో ఉండటం కూడా సేవే అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉండేవాళ్లను గవర్నర్లుగా నియమించాలని ఆయన ట్వీట్ చేశారు. పార్టీ మాజీ అధ్యక్షులు, సీఎంలు, మంత్రులను గవర్నర్లుగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. 

ఇకపోతే, తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీతో భేటీ తర్వాత కేసీఆర్ సర్కారు తీరుపై ఆమె విమర్శలు చేశారు. అన్నీ మీడియాకు తెలుసు అంటూనే ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇగో లేదని.. అందరితో ఫ్రెండ్లీగా ఉంటానన్నారు. ఏ సమస్య ఉన్నా సీఎంతో చర్చించడానికి సిద్ధమన్నారు. గవర్నర్ వ్యవస్థకు గౌరవం ఇవ్వాలని.. ప్రోటోకాల్ ను ఎలా ఉల్లంఘిస్తారని క్వశ్చన్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించానన్నారు. గవర్నర్ ప్రోటోకాల్ గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియదా అని ప్రశ్నించారు. కాగా, అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సమయంలో ఆనవాయితీ ప్రకారం ఉండాల్సిన గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేయడంతో తమిళిసైకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగింది. అలాగే యాదాద్రి ప్రారంభోత్సవానికి కూడా గవర్నర్ కు ఆహ్వానం లేకపోవడం.. ఉగాది వేడుకలకు తమిళిసై పిలిచినా టీఆర్ఎస్ నేతలు వెళ్లకపోవడంతో ఈ గ్యాప్ మరింత పెరిగింది. 

మరిన్ని వార్తల కోసం:

ఆడపిల్ల పుట్టిందని సంబురాలు.. హెలికాప్టర్లో ఇంటికి

షాంఘైలో లాక్డౌన్ పెట్టినా తగ్గని కేసులు

పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్ దురుసు ప్రవర్తన