పులి బయటికి వస్తడు.. వాళ్లకు ఒక్క చాన్స్ కాదు 11 ఇచ్చినం

పులి బయటికి వస్తడు.. వాళ్లకు ఒక్క చాన్స్ కాదు 11 ఇచ్చినం
  • అయినా అభివృద్ధి ఎందుకు చేయలే
  • కాంగ్రెస్, బీజేపీ లీడర్లు ఇచ్చే పైసలు తీసుకొని కారుగుర్తుకు ఓట్లేయ్యుండ్రి
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

జయశంకర్ భూపాలపల్లి: ‘రేపోమాపో పులి (కేసీఆర్) బయటకి వస్తడు. పెన్షన్​పెంచుతడు’అని మంత్రి కేటీఆర్​అన్నారు. భూపాలపల్లిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ‘కేసీఆర్​సావు నోట్లో తలపెట్టి 11 రోజులు దీక్ష చేస్తే తెలంగాణ వచ్చింది. ఒక్క చాన్స్ ఇవ్వమని కాంగ్రెస్ అడుగుతుంది. ఒక్క చాన్స్ కాదు11 అవకాశాలిచ్చినం. అయినా కూడా ఆనాడు ఎందుకు రాలే. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం మన ఇంటి ముందుకి వస్తది. కాంగ్రెస్‌ లో రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నరు. రేటెంత రెడ్డి అని అడుగుతున్నరు. రేవంత్ తీరు... ఓటుకు నోటు, సీటుకో రేటు అన్నట్టుగా ఉంది. పొరపాటున వేరే వాళ్ల చేతిలో పెడితే కుక్కలు చింపిన ఇస్తరైతది. రైతుబంధు ఇచ్చిన ఈగట్టున ఉంటారా?... రాబంధుల్లా పీక్కుతిన్న ఆగట్టునుంటారా? తేల్చుకోవాలి. నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఇచ్చే పైసలు తీసుకుని కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నోట్ల కట్టలతోటి దొరికిపోయినటువంటి దొంగను ప్రజలు నమ్మొద్దు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి అయితదా? రేపోమాపో కేసీఆర్ బయటకు వస్తడు. పెన్షన్​పెంచుతడు’అని కేటీఆర్​ తెలిపారు.

కేసీఆర్ జబర్దస్త్ గాఉన్నరు

సీఎం ఆరోగ్యంపై మంత్రి కేటీఆర్ మరోసారి స్పష్టత ఇచ్చారు. 'ఇక్కడికి వస్తుంటే ఓ పెద్దావిడ బొట్టు పెట్టి మీ బాపుకు ఆరోగ్యం బాగోలేదంటగా అని అడిగింది. కేసీఆర్ జబర్దస్త్ గా ఉన్నారు. లోపల కూర్చొని మనకోసమే అన్ని పనులు చేస్తుండు. తొందర్లోనే బయటికి వచ్చి అన్ని ప్రకటనలు చేస్తడు. నువ్వేం బాధపడకు అని చెప్పిన' అని కేటీఆర్ వివరించారు.