వరంగల్లో కేటీఆర్ పర్యటన.. బీఆర్ఎస్ నేతల మధ్య ఫ్లెక్సీల వార్

వరంగల్లో కేటీఆర్ పర్యటన.. బీఆర్ఎస్ నేతల మధ్య ఫ్లెక్సీల వార్

గ్రేటర్ వరంగల్లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా  ఫ్లెక్సీల రగడ నెలకొంది. కేటీఆర్ పర్యటన సందర్భంగా  ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ , మేయర్ గుండు సుధారాణి పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే డిప్యూటీ మేయర్ రిజ్వాన షమీ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా..గుర్తు తెలియని వ్యక్తులు వాటిని తొలగించారు. 

మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలపై మరో వర్గంకు చెందిన ఫ్లెక్సీలు కడుతుండగా..వద్దిరాజు రవిచంద్ర అనుచరులు అడ్డుకున్నారు. మరికొన్ని చోట్ల మేయర్ గుండు సుధారాణి  ఫ్లెక్సీలను దుండగులు చంపేశారు. 

ముందస్తు అరెస్టులు..

మరోవైపు వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు  కొనసాగుతున్నాయి. ఎస్ఎఫ్ఐ, పిడిఎస్ యు, ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ, ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందుగా అరెస్ట్ చేశారు. వారిని పలు పోలీసు స్టేషన్లకు తరలించారు. వీరితో పాటు బీజేపీ , కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. 

పోలీసుల అత్యుత్సాహం..

ముందుస్తు అరెస్టుల సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శి్ంచారు. గ్రేటర్ వరంగల్ మిల్స్ కాలనీలో బీజేపీ నేతలను అదుపులోకి తీసుకునేందుకు అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లిన పోలీసులు..ఇండ్ల  తలుపులు బద్దలు కొట్టారు. పోలీసుల తీరుతో బీజేపీ నాయకుడు బైరీ శ్యామ్  కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు. భయంతో   భైరి శ్యామ్ భార్య అస్వస్థతకు లోనయ్యారు.