
ధరణికి, భూభారతికి పోలికే లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నారాయణపేట జిల్లా మద్దూరు రెవెన్యూ సదస్సులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. పథకాల అమలును ప్రతిపక్షాలు ఓర్వడం లేదన్నారు. ధరణిలో సమస్యలున్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెప్పారన్నారు. ధరణిని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ లక్షలాది ఎకరాలు కొల్లగొట్టిందని ఆరోపించారు.
భూ భారతితో సమస్యలు తీరుస్తామన్నారు పొంగులేటి శ్రీనివాస్. ఒక్క పైసా చెల్లించకుండానే భూ సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు. అధికారులే ప్రజల దగ్గరకు వెళ్లి భూ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. పేదల కష్టాలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
రైతుల భూ సమస్యలను తెలుసుకోవడానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో నాలుగు మండలాలు పైలట్ ఎంపిక చేసాం. మద్దూరు నేలకొండపల్లి ములుగు కామారెడ్డి జిల్లా కలెక్టర్లు అన్నీ మండల పర్యటించి భూభారతిపై అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. మే 1 నుంచి ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని రాష్ట్రవ్యాప్తంగా మిగతా 28 జిల్లాలో పైలట్ మండలాలుగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు. జూన్ 2న నాలుగు పైలెట్ మండలాల్లో భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు. మోడల్ మండలాల మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోకి రెవెన్యూ అధికారులు సందర్శిస్తారు. ధరణి చట్టం ద్వారా రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు భవిష్యత్తులో రాకుండా భూభారతి చట్టం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతులకు భద్రత కల్పిస్తాo. భూములున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది అని పొంగులేటి అన్నారు.