గుడ్ న్యూస్ : ఫస్ట్ వాళ్లకే ఇందిరమ్మ ఇళ్లు.. ఐదు లక్షలు ఎప్పుడిస్తారంటే.?

ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికి ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాల నమోదు యాప్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడారు.  పేదల చిరకాల కోరిక సొంతిళ్లు అని.. పేదల సొంతింటి కలను ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. డిసెంబర్ 6 నుంచే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు.   గత పదేళ్లలో  పేదలకు ఇళ్లు నిర్మించలేదన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ఇందిరమ్మ ఇండ్లే  కనిపిస్తున్నాయన్నారు పొంగులేటి.కులమతాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. 

 కీలక అంశాలు

  • మొదటి  ఏడాదిలో 4 లక్షల 50 వేల  ఇళ్లు మంజూరు
  •  ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు
  • 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేసుకోవాలి
  •  మొదటి విడతలో సొంతింటి స్థలం ఉన్న వాళ్లకు ప్రాధాన్యత
  • కుటుంబంలో  మహిళ పేరుతో ఇల్లు మంజూరు
  •  ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు 
  • 4 విడతల్లో లబ్ధిదారులకు నగదు జమ
  •  మొదటి  విడతల లక్షా 20 వేలు
  • స్లాబ్ పడిన తర్వాత లక్షా 75 వేలు