బ్రహ్మోత్సవాలను సక్సెస్​ చేయండి

బ్రహ్మోత్సవాలను సక్సెస్​ చేయండి

భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో జరిగే బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సంక్రాంతిని పురస్కరించుకొని జనవరి 10 నుంచి 15 వరకు జరిగే జాతర పోస్టర్​ను ఆయన శనివారం మినిస్టర్ క్వార్టర్స్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన వీరభద్రుడి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో వాటికి తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 

అనంతరం కొత్తకొండ ఆలయ అధికారులు, అర్చక బృందం దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండ సురేఖను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ పత్రిక అందజేశారు. మంత్రులకు ఆలయ ఈవో కిషన్ రావు స్వామివారి ప్రసాదాన్ని అందించారు. కార్యక్రమంలో ఆలయ ఉప ప్రధాన అర్చకులు తాటికొండ రాజయ్య, అర్చక బృందం తదితరులు పాల్గొన్నారు.