
- ఏఎంవీఐలకు శిక్షణను ప్రారంభించిన మంత్రి పొన్నం
హైదరాబాద్ సిటీ, వెలుగు: రవాణా శాఖలో కొత్తగా ఉద్యోగాలు పొందిన అసిస్టెంట్ మోటార్వెహికల్ ఇన్స్పెక్టర్ల(ఏఎంవీఐ)కు మంగళవారం సిటీలోని తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ తరగతులు ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. భవిష్యత్లో ఎంత కష్టపడితే అంత పేరు సంపాదించుకుంటారన్నారు.
జులై 9 వరకు శిక్షణ ఉంటుందన్నారు. గతంలో నెల రోజుల శిక్షణ ఉండేదని, నాలుగు నెలలకు పెంచామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు తగ్గించేలా ట్రైనింగ్పొందాలన్నారు. రవాణా శాఖకు సంబంధించి మొదటిసారి లోగో తయారు చేశామని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ అకాడమీ డెరైక్టర్ శ్రీనివాస్ రావు, డిప్యూటీ డెరైక్టర్ నర్మదా తదితరులు పాల్గొన్నారు.