సర్వాయిపేటను టూరిజం సర్కిల్‌‌‌‌‌‌‌‌గా మారుస్తాం : మంత్రి పొన్నం

సర్వాయిపేటను టూరిజం సర్కిల్‌‌‌‌‌‌‌‌గా మారుస్తాం : మంత్రి పొన్నం
  • పాపన్న కోట అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం భూమిపూజ

సైదాపూర్, వెలుగు: సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను దేశానికి చాటి చెబుదామని.. పాపన్న తిరిగిన సర్వాయిపేటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలోని సర్వాయిపాపన్న నిర్మించిన కోట, చారిత్రక ఆనవాళ్లు ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రూ1.70కోట్లు మంజూరయ్యాన్నారు. శుక్రవారం కోట అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వాయిపేటను, పాపన్న కోటలను టూరిజం సర్కిల్‌‌‌‌‌‌‌‌గా అభివృద్ధి చేస్తామన్నారు.

సర్దార్ పాపన్న తెలివి, ధైర్యం, తెగువను నేటి తరాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పాపన్న నిర్మించతలపెట్టిన  హనుమంతుని గుడిని పూర్తి చేయడం, మహమ్మదాపూర్ గుట్టను, మహాసముద్రం గండినీ అభివృద్ధి చేసి టూరిజం హబ్‌‌‌‌‌‌‌‌గా మారుస్తామన్నారు. అనంతరం సైదాపూర్ మండలంలోని మోడల్ స్కూల్‌‌‌‌‌‌‌‌ను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. 

స్కూల్‌‌‌‌‌‌‌‌లో అభివృద్ధి పనులకు రూ.60 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. అంతకుముందు వెన్నంపల్లి ప్యాక్స్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ను మంత్రి ప్రారంభించారు. ఆయనవెంట కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, వెన్నంపల్లి సొసైటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ తిరుపతి రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ దొంత సుధాకర్​, తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు యాదగిరి గౌడ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.