- రెడ్ క్రాస్ వాహనాలకు పన్ను మినహాయింపు
- తలసేమియా రోగులకు బస్ పాస్ పై చర్చిస్తం
- మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: ప్రభుత్వం తరుపున ప్రతి జిల్లా హాస్పిటల్,100 బెడ్స్ హాస్పిటల్ లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసేలా సీఎం రేవంత్రెడ్డి, వైద,ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహతో మాట్లాడతానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా సందర్భంగా రాజ్ భవన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 20 రాజ్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన బ్లడ్ డోనేషన్ క్యాంప్ ను మంత్రి పొన్నం ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ర్టంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లు పరిమితంగా ఉన్నాయన్నారు. కొత్త జిల్లాలు పెరగడంతో ప్రమాదాలు పెరుగుతున్నా యన్నా రు. రెడ్ క్రాస్ వాహనాలకు రవాణా శాఖ తరుపున పన్న మినహాయింపుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తలసేమియా వ్యాధి గ్రస్తులకు బస్ పాస్ పై చర్చిస్తామన్నారు. అరుదుగా దొరికే బ్లడ్ దొరికే వారి సమాచారం రెడ్ క్రాస్ సొసైటీ వారి వద్ద ఉండాలని సూచించారు.
రక్త దానం గొప్ప కార్యక్రమన్నారు. మన శరీరం నుంచి రక్తదానం చేయడం గొప్ప దార్శనికత అని అన్నారు. రక్త దానం చేస్తే ఏదో జరుగుతుందనే అపోహ విడనాడాలని సూచించారు. సైన్స్ తో రక్తదానంపై అవగాహన ఏర్పడి మూడు నెలలకు ఒకసారి రక్తదానం ఇవ్వచ్చని అందరికీ తెలిసిపోయిందన్నారు. ఒక్కొక్కరు 50,60 సార్లు రక్త దానం చేస్తున్నారని, వారికి మరింత మంచి జరుగుతుందన్నారు.
తాను విద్యార్థి దశలోనే ప్రత్యేకమైన రోజుల్లో రక్తదానం చేశానని తెలిపారు. రక్తదాతలతో మంత్రి పొన్నం ముచ్చటించి వారిని సన్మానించారు.