బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. ఖరారు కాగానే లోకల్‌‌‌‌ బాడీస్‌‌‌‌ ఎన్నికలు : మంత్రి పొన్నం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు..   ఖరారు కాగానే లోకల్‌‌‌‌ బాడీస్‌‌‌‌ ఎన్నికలు : మంత్రి పొన్నం

కరీంనగర్, వెలుగు : బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌‌‌‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ వెల్లడించారు. బీసీ డెడికేషన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ రిజర్వేషన్లపై మంత్రివర్గంతో చర్చించిందని చెప్పారు. రిజర్వేషన్లు ఖరారు కాగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. గురువారం కరీంనగర్‌‌‌‌లో మంత్రి శ్రీధర్‌‌‌‌బాబుతో కలిసి సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ కంపెనీని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల అమలుపై రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎవరూ భయపడడం లేదని, విమర్శించే వారిని పట్టించుకోబోమన్నారు. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా బీసీ డెడికేషన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ వేసి.. అధ్యయనం చేయడం వల్లే ఎన్నికల నిర్వహణలో ఆలస్యంగా జరిగిందన్నారు. 

బీసీలకు అన్యాయం చేస్తూ గత ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిందని గుర్తు చేశారు. కానీ తాము కామారెడ్డి డిక్లరేషన్‌‌‌‌లో చెప్పినట్లు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు.