ట్రిపుల్‌‌ ఐటీలో సమస్యలు పరిష్కరిస్తాం

ట్రిపుల్‌‌ ఐటీలో సమస్యలు పరిష్కరిస్తాం
  • మంత్రి సీతక్క హామీ
  • ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఐటీ అభివృద్ధికి రూ. కోటి మంజూరు

భైంసా/బాసర, వెలుగు : బాసర ట్రిపుల్‌‌‌‌ ఐటీలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. స్టూడెంట్లు బాగా చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని సూచించారు. స్టూడెంట్లకు ఉత్తమ విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ముథోల్‌‌‌‌ ఎమ్మెల్యే రామారావు పటేల్‌‌‌‌, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్‌‌‌‌, దండే విఠల్, నిర్మల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ అభిలాష అభినవ్​, ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి శుక్రవారం బాసర ట్రిపుల్‌‌‌‌ ఐటీని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా అడ్మినిస్ట్రేటివ్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌లో స్టూడెంట్లతో మీట్‌‌‌‌ అయ్యారు. సరిపోను ఫ్యాకల్టీ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్టూడెంట్స్‌‌‌‌ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బెడ్స్, జనరల్‌‌‌‌ స్టోర్‌‌‌‌, కౌన్సెలర్లు, స్టేడియం, మెస్‌‌‌‌ల సంఖ్యను పెంచాలని, మెస్‌‌‌‌ కాంట్రాక్టర్‌‌‌‌ను మార్చాలని స్టూడెంట్లు కోరారు. ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌, ఇంటర్నెట్‌‌‌‌ ఫెసిలిటీ కల్పించడంతో పాటు, లైబ్రరీలో వివిధ కాంపిటీషన్స్‌‌‌‌కు సంబంధించిన బుక్స్‌‌‌‌ అందుబాటులో ఉంచాలని, మహిళా కేర్‌‌‌‌ టేకర్లను నియమించాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ బాసర ట్రిపుల్‌‌‌‌ఐటీని ఉత్తమ విద్యా సంస్థగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలను చేపట్టేలా ప్రభుత్వంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. వెల్లడించారు. విద్యార్థులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. స్టూడెంట్ల సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల కోసం రూ. కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె వెంట వీసీ గోవర్దన్‌‌‌‌, ఆర్డీవో కోమల్‌‌‌‌రెడ్డి ఉన్నారు.

రైతుభరోసాపై దుష్రచారం నమ్మొద్దు

రైతు భరోసా పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని మంత్రి సీతక్క సూచించారు. నిర్మల్‌‌‌‌ జిల్లా బాసరలోని జీఎస్‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌లో శుక్రవారం నిర్వహించిన మీటింగ్‌‌‌‌లో ఆమె మాట్లాడారు. రైతు భరోసాను ప్రభుత్వం తప్పనిసరిగా విడుదల చేస్తుందని చెప్పారు. బీజేపీ, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. దిలావర్‌‌‌‌పూర్‌‌‌‌ ఇథనాల్‌‌‌‌ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్‌‌‌‌ ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని, కానీ ఇప్పుడు ఆ పార్టీ లీడర్లే రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.