అది సర్కార్ బంగ్లా..పాడి కౌశిక్ రెడ్డిపై సీతక్క సీరియస్

అది సర్కార్ బంగ్లా..పాడి కౌశిక్ రెడ్డిపై సీతక్క సీరియస్

అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి  కౌశిక్ రెడ్డి  కాంట్రవర్సరీ కామెంట్స్ చేశారు. మంత్రి సీతక్కను ఉద్దేశించి మాట్లాడిన కౌశిక్ రెడ్డి .. సీతక్క మాట్లాడినట్లు తన లైఫ్ స్టైల్ వేరు ..నా లైఫ్ స్టైల్ వేరు.   వైఎస్  రాజశేఖర్ రెడ్డి కట్టించిన ఐదెకరాల  భవనంలో సీతక్క ఉంటున్నరు..అది మీ స్టేచర్ ..500 గజాల స్థలంలో చిన్న ఇంట్లో ఉంటున్న అది నా స్టేచర్. ఈ మధ్య సీతక్క ములుగు వెళ్లడం లేదు . హైదరాబాద్ లోనే ఉంటున్నారు అని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే కౌశిక్ రెడ్డి కామెంట్స్ పై  మంత్రి సీతక్క, శ్రీధర్ బాబు మండిపడ్డారు.

నేను  సర్కార్ కట్టిన భవనంలోనే ఉంటున్న. గవర్నమెంట్ కట్టిన మినిస్టర్ క్వార్టర్స్ లో ఉండొద్దా?? అది తమ స్థాయికి చాలా పెద్దది.  నా కొడుకు కూడా హన్మకొండలోనే ఉంటాడు. ఆ భవనంను నేనేమి కట్టుకోలేదు. అది ఐదెకరాలు ఉన్నదని నేను అనుకోవడం లేదు.కౌశిక్ రెడ్డి సభను తప్పుదోవపట్టించే విధంగా మాట్లాడొద్దు..బీఆర్ఎస్ నాయకులు అందరు నా ఇంటికి వచ్చి చూసుకోండి. నీ నియోజకవర్గానికి నేను వస్తా..నా నియోజకవర్గానికి నువ్వు రా..ఎవరు ఎక్కువ ప్రజల్లో ఉన్నరో తెలుస్తది..దీనిపై కౌశిక్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా అని సీతక్క ఫైర్ అయ్యారు.

ALSO READ | డీలిమిటేషన్ తో తీవ్ర నష్టం.. భారత జీడీపీకి దక్షిణాది రాష్ట్రాలే ఆయువు పట్టు: కేటీఆర్

సీతక్క ప్రభుత్వం కట్టిన క్వార్టర్స్ లో ఉంటే దీన్నికూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు శ్రీధర్ బాబు. కౌశిక్ రెడ్డి కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఉంటున్నారని..ఆదివాసి బిడ్డ క్వార్టర్స్ లో ఉంటే కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు శ్రీధర్ బాబు.