గ్రామాల‌‌‌‌ను ఆద‌‌‌‌ర్శంగా తీర్చిదిద్దాలి

 గ్రామాల‌‌‌‌ను ఆద‌‌‌‌ర్శంగా తీర్చిదిద్దాలి
  • విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు
  • రివ్యూ మీటింగ్ లో డీపీఓల‌‌‌‌కు మంత్రి సీత‌‌‌‌క్క హెచ్చరిక
  • తాగునీటి విషయంలో ఎప్పటికప్పుడు పరీక్షలు జరపాలని సూచన
  • పంచాయతీ కార్మికులు, మల్టీపర్పస్  వర్కర్లకు  5 లోపు నేరుగా జీతాలు చెల్లిస్తామని  వెల్లడి

హైదరాబాద్, వెలుగు: విధి నిర్వహణలో అల‌‌‌‌స‌‌‌‌త్వం ప్రదర్శిస్తే  కఠిన చర్యలు తప్పవని అధికారులను మంత్రి సీత‌‌‌‌క్క హెచ్చరించారు. హైదరాబాద్ లోని  ఎర్రమంజిల్ గ్రామీణ మంచి నీటి స‌‌‌‌ర‌‌‌‌ఫ‌‌‌‌రా కేంద్ర కార్యాల‌‌‌‌యంలో జిల్లా పంచాయ‌‌‌‌తీ అధికారుల‌‌‌‌తో (డీపీఓ) మంత్రి ఆదివారం స‌‌‌‌మీక్షా స‌‌‌‌మావేశం నిర్వహించారు. పీఆర్, ఆర్​డీ శాఖల కార్యద‌‌‌‌ర్శి లోకేశ్​ కుమార్, డైరెక్టర్​ సృజ‌‌‌‌నతో క‌‌‌‌లిసి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల‌‌‌‌పై స‌‌‌‌మీక్షించారు. 

గ్రామాల్లో నిధుల వినియోగం, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, పనుల పురోగతి, పచ్చదనం, ఆయా జిల్లాల్లో నెల‌‌‌‌కొన్న ప‌‌‌‌రిస్థితుల‌‌‌‌పై చ‌‌‌‌ర్చించారు. సీతక్క మాట్లాడుతూ పంచాయ‌‌‌‌తీ రాజ్  శాఖకు వన్నె తెచ్చేలా పనిచేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాల‌‌‌‌న్నారు. ప‌‌‌‌ల్లెల అభివృద్ధిపై ప్రజాప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింద‌‌‌‌ని, పల్లెలను ప్రగతిపథంలో నడిపేలా డీపీఓలు ప‌‌‌‌నిచేయాల‌‌‌‌ని  సూచించారు.  అంగ‌‌‌‌న్ వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠ‌‌‌‌శాల‌‌‌‌లు, గురుకులాల‌‌‌‌కు సుర‌‌‌‌క్షిత మంచినీరు స‌‌‌‌ర‌‌‌‌ఫ‌‌‌‌రా అయ్యేలా చూడాలన్నారు. ‘‘ఎస్సీ, ఎస్టీ కాల‌‌‌‌నీలు, ప్రభుత్వ పాఠ‌‌‌‌శాల‌‌‌‌లకు స‌‌‌‌ర‌‌‌‌ఫ‌‌‌‌రా అవుతున్న తాగునీటి విష‌‌‌‌యంలో ఎప్పటిక‌‌‌‌ప్పుడు ప‌‌‌‌రీక్షలు నిర్వహించాలి.

 పాఠ‌‌‌‌శాల‌‌‌‌లు తెరిచేలోపు తాగునీటి స‌‌‌‌ర‌‌‌‌ఫ‌‌‌‌రా పూర్తవుతున్నందున్న ఈ స‌‌‌‌మ‌‌‌‌స్యను ప‌‌‌‌రిష్కరించేందుకు హెడ్ మాస్టర్,  కార్యద‌‌‌‌ర్శులు స‌‌‌‌మ‌‌‌‌న్వయంతో వ్యవ‌‌‌‌హరించి ఉద‌‌‌‌య‌‌‌‌మే ట్యాంకులు నింపుకునేలా చ‌‌‌‌ర్యలు చేప‌‌‌‌ట్టాలి. కొన్ని జిల్లాల్లో అనుకున్నంత మేర ప‌‌‌‌నులు ముందుకు సాగ‌‌‌‌డం లేదు. 

పొర‌‌‌‌పాట్లను సరిదిద్దుకుని ప‌‌‌‌నుల్లో వేగం పెంచాలి. వ‌‌‌‌చ్చే వేస‌‌‌‌వి కాలంలో తాగునీటి స‌‌‌‌మ‌‌‌‌స్య లేకుండా యాక్షన్ ప్లాన్ ను రూపొందించాలి” అని మంత్రి పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో సఫాయి కార్మికులు, మల్టీపర్పస్  వర్కర్ల దే కీలక పాత్ర అని, వారికి ప్రతినెలా ఐదో తారీఖు లోపు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామ‌‌‌‌ని తెలిపారు. గ్రామ‌‌‌‌ పంచాయతీల ద్వారా కాకుండా నేరుగా పీఆర్​కమిషనర్ కార్యాలయం నుంచే ఏకకాలంలో జీతాలు చెల్లించేలా ప్రణాళిక రూపొందించామని మంత్రి చెప్పారు.  

కారుణ్య నియామకాల ఫైల్​ క్లియర్​ చేయించా

పీఆర్, ఆర్డీ శాఖలో 2017 నుంచి పెండింగ్​లో ఉన్న  కారుణ్య నియామకాల ఫైల్ ను క్లియర్ చేయించానని, డీపీఓల సమస్యల ప‌‌‌‌రిష్కారానికీ కృషి చేస్తాన‌‌‌‌ని మంత్రి సీత‌‌‌‌క్క పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతినెలా డీపీఓల‌‌‌‌తో స‌‌‌‌మీక్ష స‌‌‌‌మావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.  డీపీఓలు త‌‌‌‌మ కింది స్థాయి ఉద్యోగుల‌‌‌‌తో 15 రోజులకు ఒకసారి సమీక్షలు నిర్వహించి నివేదిక‌‌‌‌ స‌‌‌‌మ‌‌‌‌ర్పించాల‌‌‌‌ని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛదనం– పచ్చదనం, పనుల జాతరను విజయవంతం చేసినందుకు సీఎం రేవంత్  రెడ్డి అభినందించిన విష‌‌‌‌యాన్ని మంత్రి గుర్తుచేశారు.

పీఆర్, ఆర్డీ శాఖల కార్యద‌‌‌‌ర్శి లోకేశ్​ మాట్లాడుతూ గ్రామాల్లో చెత్త సేక‌‌‌‌ర‌‌‌‌ణ ప‌‌‌‌క్కాగా జ‌‌‌‌ర‌‌‌‌గాల‌‌‌‌న్నారు. త‌‌‌‌డిచెత్త, పొడిచెత్తను వేరుచేసే విధానాన్ని అవ‌‌‌‌లంబించాల‌‌‌‌ని సూచించారు. స్థానిక ఎన్నిక‌‌‌‌ల‌‌‌‌ షెడ్యూల్  త్వరలో వ‌‌‌‌చ్చే అవ‌‌‌‌కాశం ఉండటంతో అధికారులంతా సిద్ధంగా ఉండాల‌‌‌‌న్నారు.