
- మంత్రి శ్రీధర్ బాబు
పెద్దపల్లి/గోదావరిఖని/మంథని, వెలుగు: రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని ఆశీర్వదించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ల సమావేశంలో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు విజయరమణారావు, ఠాకూర్మక్కాన్సింగ్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు పాల్గొని మాట్లాడారు. రానున్న రోజుల్లో పెద్దపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు.
జాబ్ క్యాలెండర్ ద్వారా నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అనంతరం మంథనిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మినిమమ్ వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బి.జనక్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, బండారి శ్రీకాంత్, ఏఎంసీ చైర్మన్లు, డైరెక్టర్లు, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు