తెలంగాణలో మారియెట్ ఇంటర్నేషనల్ సంస్థ పెట్టుబడులు: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలో మారియెట్ ఇంటర్నేషనల్ సంస్థ పెట్టుబడులు: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇంటర్నేషన్ సంస్థ మారియెట్  ముందుకు వచ్చింది. హాస్పిటాలిటికి చెందిన మారియెట్  సంస్థ..దేశంలోనే మొదటి గ్లోబర్ కేపబిలిటీ సెంటర్ (GCC) ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది. ఫిన్ టెక్, మెడ్ టెక్ లో మాత్రమే కాదు.. హాస్పిటాలిటీ రంగంలో కూడా పెట్టుబడులు వస్తున్నాయని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

అమెరికా పర్యటనకు వెళ్లినపుడు తెలంగాణలో పెట్టుబుడులు పెట్టాలని మారియెట్  కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపాం.. సానుకూలంగా స్పందించించారు. భారత్ లో మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ షెఫెస్ట్ సిటీగా భావించి పెట్టుబుడులు పెట్టేందుకు ముందుకు వచ్చారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. GCC లను టైర్ 2, టైర్ 3 సిటీలకు విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. GCC లతో 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. 2025లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అందుబాటులోకి వస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 

మరోవైపు మూసీ ప్రక్షాళనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మూసీ అభివృద్ధిపై బీఆర్ ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మూసీ అభివృద్ది, సంక్షేమంపై ఛాలెంజ్ చేస్తామన్నారు. బీఆర్ ఎస్ నేతలు రాహుల్ గాంధీపై అనవసర విమర్శలు చేస్తున్నారు.. రాహుల్ పై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమన్నారు మంత్రి శ్రీధర్ బాబు.