
- అసెంబ్లీలో మున్సిపల్ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్‌బాబు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే క్యాబినెట్ ఓకే చెప్పింది. మున్సిపల్సవరణ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్సమావేశాల్లోనే దీనిపై చర్చ జరుగనుంది. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతోపాటు సుజాతనగర్ మండలంలోని ప్లేన్ ఏరియాలుగా ఉన్న సుజాతనగర్, నర్సింహ సాగర్, కొమిటిపల్లి, నిమ్మలగూడెం, లక్ష్మీదేవిపల్లి, మంగపేట, నాయకుల గూడెం పంచాయతీలను కలుపుతూ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.
ఆ తర్వాత గవర్నర్ఆమోదంతో గెజిట్రిలీజ్కానుంది. ఈ విషయమై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.