ఏఐతో హెల్త్ ప్రొఫైల్ : మంత్రి శ్రీధర్ బాబు

 ఏఐతో హెల్త్ ప్రొఫైల్  : మంత్రి శ్రీధర్ బాబు
  • రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తయారు చేస్తం: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్‌‌ను తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. బుధవారం మాడ్యూర్ హాస్పిటల్ సర్వీసెస్ రూపొందించిన ‘ఎండీఆర్​ మై డిజీ రికార్డ్’ యాప్‌‌ను ప్రారంభించి, మాట్లాడారు. ‘‘చాలా మంది పేషెంట్లు తొలుత ఓ ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకుని ట్రీట్‌‌మెంట్​ తీసుకుంటున్నారు. అక్కడ నయం కాకపోతే మరో ఆసుపత్రికి వెళ్తున్నారు. 

ఫలితంగా అన్ని టెస్టులను మళ్లీ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. దీంతో పేషెంట్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో అందరి హెల్త్ ప్రొఫైల్ అందుబాటులోకి వస్తే.. పేషెంట్లకు అదనపు భారం తగ్గుతుంది. భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడానికి వీలవుతుంది. 

అందుకే హెల్త్ ప్రొఫై ల్‌‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఏఐతో హెల్త్ ప్రొఫైల్‌‌ను తయారు చేసి అన్ని రాష్ట్రాలకు స్ఫూర్తి గా నిలుస్తాం” అని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్‌‌ మహేశ్ గౌడ్​, మాడ్యూర్ హస్పిటల్స్ సర్వీసెస్ చైర్మన్ మోటూరి కృష్ణప్రసాద్​, సీఈవో డాక్టర్ సరోజ్ గుప్తా, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ డాక్టర్ క్రిస్ హాంప్రయ్స్ తదితరులు పాల్గొన్నారు.