బలరాం నాయక్​ను భారీ మెజార్టీతో గెలిపించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

గుండాల/ఆళ్లపల్లి,  వెలుగు : మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్​ అభ్యర్థి పోరిక బలరాం నాయక్​ను రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్​చార్జి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. బుధవారం గుండాల, ఆళ్లపల్లి మండల కేంద్రాల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా కష్టపడి పని చేశారో అదేవిధంగా కష్టపడి మానుకోటలో బలరాం నాయక్​ను గెలించాలని కోరారు.

కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  రాష్ట్రంలో ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. పారెస్టు పర్మిషన్ లేక ఆగిపోయిన సాయనపల్లి, రంగాపురం మర్కోడ్, బట్టుపల్లి లింగాల, పస్త్ర మధ్య నిలిచిపోయిన రోడ్ల పనులను పర్మిషన్ తెచ్చి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుండాలలో కాంగ్రెస్ లీడర్స్ ముత్యమాచారి, ఎస్.కె ఖదీర్

ఈసం పాపారావు, ఆళ్లపల్లిలో మండల అధ్యక్షుడు పాయం రామ్ నరసయ్య, కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, సీపీఎం నాయకులు  మహమ్మద్ అతహార్, బొల్లోజు అయోధ్య, పుల్లారెడ్డి, వాసిరెడ్డి చలపతి రెడ్డి, పోటు రంగారావు, నెల్లూరి నాగేశ్వరరావు, అనీల్ కుమార్, చందా సంతోష్ తదితరులు పాల్గొన్నారు.