డివైడర్ల రిపేర్లు స్పీడప్​ చేయండి : మంత్రి తుమ్మల

డివైడర్ల రిపేర్లు స్పీడప్​ చేయండి :  మంత్రి తుమ్మల
  • ఆర్ అండ్ బీ ఆఫీసర్లకు మంత్రి తుమ్మల ఆదేశం

ఖమ్మం రూరల్, వెలుగు :  ఖమ్మం రూరల్ మండలంలోని కోదాడ క్రాస్ రోడ్డు నుంచి కరుణగిరి రోడ్డు వరకు రోడ్డు, డివైడర్లు చాలా వరకు దెబ్బతిన్నాయని, వాటి రిపేర్లు పనులను శ్రీరామనవమి లోపు పూర్తిచేయాలని ఆర్ అండ్ బీ అధికారులను మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఫోన్​లో ఆదేశించారు.

పూర్తయిన డివైడర్లు, సర్కిళ్లలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, గ్రీనరీ, పెయిటింగ్ లాంటి పనులు చేపట్టాలని ఏదులాపురం మున్సిపల్ కమిషనర్, ఖమ్మం కలెక్టర్ కు సూచించారు. ఖమ్మం సిటీ, ఎదులాపురం మున్సిపాలిటీ బ్యూటిఫికేషన్ కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని హైదరాబాద్ సిటీ బ్యూటిఫికేషన్ ఇన్​చార్జి కృష్ణకు చెప్పారు.