- యుద్ధ ప్రాతిపదికన మెట్రో విస్తరణ
- మౌలిక సదుపాయాల కల్పినకు చర్యలు
- ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదద్దుతామని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తాను హైదరాబాద్ లోనే పుట్టి పెరిగానని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన మెట్రో విస్తరణకుచర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
ఇవాళ నరెడ్కో ప్రాపర్టీ షోకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నరెడ్కోకు గతంలో ఉన్న అనుమతులను తమ ప్రభుత్వం రద్దు చేయదని చెప్పారు.
క్రెడాయ్, ట్రెడ్కో, నరెడ్కో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్‌ఆర్ నిర్మించిందని, ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ నిర్మిస్తున్నామని అన్నారు.
ALSO READ | పోలీస్ శాఖ కీలక నిర్ణయం: బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఊరట
ప్రపంచ స్థాయి స్కిల్ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ తీసుకొస్తున్నామని చెప్పారు. నగరంలో మౌలికసదుపాయాల కల్పన కోసం రూ.10వేల కోట్లు కేటాయించామని వివరించారు. తమ ప్రభుత్వం వ్యాపార రంగానికి అండగా ఉంటుందని వివరించారు.