మంచి మంచి కట్టుబాట్లు : మొగుడిని బీరు బాటిల్ తో పొడిచి చంపి.. ప్రియుడికి వీడియో కాల్ చేసి చూపించిన భార్య

మంచి మంచి కట్టుబాట్లు : మొగుడిని బీరు బాటిల్ తో పొడిచి చంపి.. ప్రియుడికి వీడియో కాల్ చేసి చూపించిన భార్య

ఈ మధ్య ప్రియుడి కోసం భర్తను చంపడం,లేదా పిల్లలను చంపుతున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. లేటెస్ట్ గా ఓ భార్య తన  భర్తను బీరు బాటిల్ తో పొడిచి చంపి ప్రియుడికి వీడియో కాల్ చేసి చూపించి ఖతం హోగయా..(పని పూర్తయిందని చెప్పింది). ఈ  దారుణ ఘటన   మధ్యప్రదేశ్ లోని బుర్హానాపూర్ జిల్లాలో జరిగింది.  భర్తను చంపిన భార్యతో పాటు ఆమె ప్రియుడు మరో ఇద్దరు నిందితులను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బుర్హాన్‌పూర్ ఎస్పీ దేవేంద్ర పాటిదార్  వివరాల ప్రకారం.. ఏప్రిల్ 13న, ఐటీఐ కళాశాల ఎదురుగా ఇండోర్ -ఇచాపూర్ రోడ్డు సమీపంలోని పొదల్లో ఒక మృతదేహం లభ్యమయినట్టు పోలీసులకు సమాచారం అందింది. దర్యాప్తులో మృతుడిని షాపూర్ నివాసి రామచంద్ర పాండే కుంబి పాటిల్ కుమారుడు రాహుల్ అలియాస్ గోల్డెన్‌గా గుర్తించాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం.  సంఘటన జరిగినప్పటి నుంచి రాహుల్ భార్య పరారీలో ఉంది.  యువరాజ్ అనే వ్యక్తితో ఆమెకు సంబంధం ఉందని దర్యాప్తులో తేలింది. యువరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించినప్పుడు  తన ప్రియురాలు రాహుల్ భార్యతో రాహుల్ హత్యకు ప్లాన్ చేసినట్లు అతను అంగీకరించాడు. 

రాహుల్ అలియాస్ గోల్డెన్‌ కు  17 ఏళ్ల అమ్మాయితో  నాలుగు నెలల క్రితం  పెళ్లి జరిగింది. రాహుల్ భార్య యువరాజు అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. దీంతో ఎలాగైనా తన భర్త రాహుల్ ను చంపేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఇందులో భాగంగానే  ఏప్రిల్ 12న రాత్రి షాపింగ్ చేస్తామని  రాహుల్ ను ఆమె బయటకు తీసుకెళ్లింది. ఈ విషయం ముందుగానే తన ప్రియుడికి చెప్పింది.  

ALSO READ | Viral Video: బిజీ రోడ్డులో కాలు మీద కాలేసుకుని టీ తాగుతూ వీడియో.. నెక్ట్స్ ఏం జరిగిందంటే..

ప్లాన్ ప్రకారం ఐటీఐ కాలేజ్ దగ్గర రాగనే తన చెప్పు తెగిపోయిందని చెప్పి బైక్ ఆపమని రాహుల్ కు చెప్పింది. వెంటనే బైక్ ఆపగానే ఓ ఇద్దరు వ్యక్తులు లలిత్,మరో మైనర్ బైక్ పై వచ్చి   రాహుల్ ను పొదల్లోకి లాక్కెళ్లారు. ఆమె రాహుల్ ను  బీరుబాటిల్ తో దాడి చేసింది. ఆ తర్వాత లలిత్, మైనర్  మరో బీర్ బాటిల్తో రాహుల్ ను 36 సార్లు పొడిచారు. దీంతో  రాహుల్ అక్కడిక్కడే చనిపోయాడు.  హత్య తర్వాత రాహుల్ భార్య తన ప్రియుడు యువరాజుకు వీడియో కాల్ చేసి మృతదేహాన్ని చూపించి  పని అయిపోయింది అని చెప్పింది.  తర్వాత  ఆమె తన ప్రియుడు యువరాజు మరో ఇద్దరు నిందితులతో కలిసి రావర్ రైల్వే స్టేషన్‌కు  వెళ్లారు. అక్కడి నుంచి ఉజ్జయినికి వెళ్లే ముందు ఇటార్సికి రైలు ఎక్కి పరారయ్యారు.

నిందితులు నలుగురు నిందితులు మొబైల్ ఫోన్‌లో మాట్లాడుకుంటుండేవారు.  అరెస్టు చేసిన నిందితుల్లో  కోద్రి షాపూర్ బుర్హాన్‌పూర్ నివాసి  భరత్ అలియాస్ యువరాజ్,  లలిత్, మృతుడి మైనర్ భార్య. మరో  మైనర్ ఉన్నారని తెలిపారు.