మే 14న రామప్ప ఆలయానికి మిస్​వరల్డ్​ టీం

మే 14న రామప్ప ఆలయానికి మిస్​వరల్డ్​ టీం

ములుగు, వెలుగు : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప ఆలయ సందర్శనకు మిస్ వరల్డ్ టీం మే 14న రాబోతోందని, ఆఫీసర్లు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ములుగు కలెక్టర్ దివాకర అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో ఎస్పీ శబరీశ్, అడిషనల్​ కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావుతో కలిసి కలెక్టర్​ రామప్పలో ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించారు. మే 14న అందాల పోటీల్లో పాల్గొననున్న పలు దేశాలకు చెందిన మహిళలు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారని, నేషనల్ హైవేలోని రోడ్డు పనులు మహమ్మద్ గౌస్ పల్లి నుంచి జంగాలపల్లి వరకు, జంగాలపల్లి నుంచి రామప్ప టెంపుల్ వరకు ఆర్ అండ్ బీ రోడ్డు, దేవాలయం నుంచి హరిత హోటల్ వరకు పంచాయతీ రాజ్ రోడ్డును ఇంజినీరింగ్ అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి మరమ్మతులు చేపట్టాలని, ఈనెల 30 వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. స్వాగత ఆర్చ్, హరిత కాటేజ్​లకు పెయింటింగ్ వేయాలని సూచించారు. 

పర్యటనకు సంబంధించి వాట్సాప్​ గ్రూప్​ ఏర్పాటు చేయాలని, పర్యటనకు సంబంధించిన ఫొటోలను సెండ్​ చేయాలని చెప్పారు. సమావేశంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రొఫెసర్ పాండురంగారావు, డీఎస్పీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, భూ భారతి కి సంబంధించి అవగాహన కల్పించేందుకు ఈ నెల 17 నుంచి రెవెన్యూ గ్రామాల్లో ప్రత్యేక బృందాలు సందర్శించి ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించనున్నట్లు కలెక్టర్​ తెలిపారు.