
నిజామాబాద్ క్రైమ్, వెలుగు : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తప్పిపోయిన బాలుడిని పోలీసులు మంగళవారం తల్లికి అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ కు చెందిన కేశ రెడ్డి లత తన రెండున్నరేళ్ల కుమారుడిని తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రి ఆవరణలో బాబుని కిందికి దించి ఆమె వేరే పనులు చూసుకుంటుండగా బాబు తప్పిపోయాడు.
దీంతో కంగారుపడిన లత వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బస్టాండ్ ఏరియాలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ అరుణ బాబు ఆచూకీ కనిపెట్టి తల్లికి అప్పగించారు. బాబు ఆడుకుంటూ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాడని, ఎవరు తీసుకెళ్లలేదని టౌన్ ఎస్హెచ్వో రఘుపతి స్పష్టం చేశారు.