
థంబ్ నెయిల్లో కనిపిస్తోంది వాటర్ ఫౌంటెన్ అనుకుంటున్నారా..రోడ్డుపై వెళ్లే వాహనదారులకు అహ్లాదాన్ని అందించేందుకు రోడ్డు పక్కన వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారని భావిస్తున్నారా..కాదు..కానే కాదు..మీ అంచనాలన్నీ తప్పే. ఎందుకంటే ఇది వాటర్ ఫౌంటెన్ కాదు. మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ కారణంగా ఎగిసిపడుతున్న ..వృథాగా పోతున్న మంచినీరు.
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని హైదరాబాద్ బీజాపూర్ హైవేపై మిషన్ భగీరథ పైప్ లైన్ లీకైంది. దీంతో మంచినీరు భారీ ఎగిసిపడ్డాయి. పైప్ లైన్ లీకేజీ అయిన ప్రాంతంలోనే హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉండడంతో షాక్ తగులుతుందేమోనని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.
పైప్ లైన్ లీకేజీతో మిషణ్ భగీరథ నీళ్లు వృథాగా పోతుంటే సంబంధిత అధికారు పట్టించుకోలేదు. పైప్ లీక్ అవుతున్న అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైవే పక్కన పైప్ లైన్ లీక్ అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని గంటల తర్వాత అధికారులు స్పందించి ఈ పైప్ లైన్ కు మరమ్మతులు చేశారు. అప్పటి వరకు మంచినీరు వృథాగానే పోయింది.