మియాపూర్లో ప్రజలకు కంటి మీద కులుకు లేకుండా చేస్తున్నాడు ఓ ఘరానా దొంగ. వేసిన తలుపులు వేసినట్లే ఉంటయ్.. కానీ, ఇంట్లో మాత్రం విలువైన వస్తువులు, డబ్బులు మాయం అయితయ్. దీంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇంటికి తాళం వేసి ఎదైనా పని మీద బయటికి వెళ్లామా? అంతే సంగతి.. అట్లుంటది ఆ దొంగ చేతివాటం.
తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మియాపూర్ పోలీసులు.. పక్కాగా ప్లాన్ చేసి, ఘరానా దొంగను పట్టుకున్నారు నిందితుడు వద్ద నుంచి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు.
అనంతరం మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో డీసీపీ వినిత్.. నిందితుడి వివరాలను వెల్లడించారు. మియాపూర్ చందానగర్, గచ్చిబౌలి, కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిల్లో దాదాపు ఇరవై ఇంట్లో దోంగతానలకు పాల్పడిన ఘరానా దోంగను అరెస్టు చేసినట్లు తెలిపారు.
" నిందితుడి నుంచి 16 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలు, రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా విక్రమపురం గ్రామానికి చెందిన అభిలాష్ (29) నగరంలో కేపీహెచ్ బీలో నివాసం ఉంటున్నాడు.. మహరాష్ట్ర నాగ్ పూర్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతూ మద్యలో మానేశాడు.జల్సాలకు అలవాటు పడి ఈజీ మని కోసం దొంగతనాలకు అలవాటు పడ్డాడు. తాళం వేసిన ఇండ్లు,సేక్యురిటీ తక్కువగా ఇండ్లు లక్ష్యంగా చేసుకుని దోంగతనలకు పాల్పడేవాడు. అపార్ట్ మెంట్స్ లో ఎవరైనా అనుమానం వచ్చి అడిగితే డేలివరీ బాయ్ అని తప్పించుకునేవాడు. నిందితుడుపై ఇప్పటికే 20 కేసులు నమోదయ్యాయి" అని ఆయన వెల్లడించారు.