
- వచ్చే నెల 20న ఎంట్రన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకులాల్లో 2025–26 అకడమిక్ ఇయర్ కు సంబంధించి బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి మహాత్మా జ్యోతి బాపూలే తెలంగాణ బ్యాక్ వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 6, 7, 8, 9వ తరగతుల్లో ఇంగ్లీష్ మీడియంలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేస్తారు. వచ్చే నెల 20న సీట్ల భర్తీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నామని సొసైటీ జాయింట్ సెక్రటరీ తిరుపతి నోటిఫికేషన్ లో తెలిపారు.
ఈ పరీక్ష రాయాలనుకున్న స్టూడెంట్స్ www.mjptbcwreis.telangana.gov.in or http.//mjptbcadmissions.org వెబ్ సైట్లో రూ.150 చెల్లించి ఈ నెల 6 నుంచి 31 వరకు అప్లై చేసుకోవాలని ఆయన సూచించారు. వచ్చే నెల 15 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్‌కు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.