రాజన్న జిల్లాలోని కేజీబీవీల్లో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌

వేములవాడరూరల్/చందుర్తి, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాలోని కేజీబీవీల్లో రాష్ట్రంలోనే మొదటిసారిగా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించినట్లు విప్‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. గురువారం రుద్రంగి, చందుర్తి, వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి కేజీబీవీలో ఏర్పాటు చేసిన ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ఎడ్యుకేషన్​సెంటర్లను కలెక్టర్ సందీప్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝాతో కలిసి ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 13 కేజీబీవీల్లో కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ స్థాయిలో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఐఐటీ, జేఈఈ, నీట్, యూజీ ఫౌండేషన్ కోర్సులను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో క్లాసెస్ చెప్పించనున్నట్లు చెప్పారు. అన్ అకాడమీ సౌజన్యంతో ఈ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్​సెంటర్లను 

నిర్వహించనున్నట్లు అమలుచేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఈవో జగన్ మోహన్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, వేములవాడ, రుద్రంగి ఏఎంసీ చైర్మన్లు రొండి రాజు, చెల్కల తిరుపతి, వైస్ చైర్మన్ మల్లేశం ఉన్నారు. 

మాఘ అమావాస్య జాతరపై రివ్యూ 

కోనరావుపేట, వెలుగు: వేములవాడ అనుబంధ దేవాలయమైన కోనరావుపేట మండలం మామిడిపల్లి సీతారాముల ఆలయంలో మాఘా అమావాస్య జాతరను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. గురువారం మామిడిపల్లి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దత్త దేవాలయం శ్రీ సీతారామ స్వామి ఆలయంలో మాఘ అమావాస్య  జాతర ఏర్పాట్లపై అధికారులతో రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. 

జనవరి 29న మాఘ అమావాస్య జాతర వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ జాతరకు సుమారు  50 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, వారికి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, చలవ పందిళ్లు, శానిటేషన్​వంటి ఏర్పాట్లు చేయాలన్నారు.

రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఈఈ రామ్ కిషన్ రావు, డీఈ మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, అధికారులుపాల్గొన్నారు.