- విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి, వెలుగు: ధర్మపురి నియోజకవర్గానికి మేడారం రిజర్వాయర్, రంగధామునిపల్లె చెరువు గుండెకాయ వంటివని విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గొల్లపల్లి మండలం రంగధామునిపల్లె చెరువును ఇరిగేషన్ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తలాపున గోదావరి, మేడారం రిజర్వాయర్ ఉండి కూడా గత ప్రభుత్వం ఇక్కడి రైతాంగానికి సాగునీటిని అందించలేకపోయిందన్నారు.
గొల్లపల్లి మండలం రంగధామునిపల్లె చెరువు కింద వెల్గటూర్, గొల్లపల్లి, పెగడపెల్లి మండలాల్లో 700 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. గత ప్రభుత్వంలో కొప్పుల ఈశ్వర్ మంత్రిగా వ్యవహరించినా ఇక్కడి ప్రాంతానికి నీరు రాలేదన్నారు. కాళేశ్వరం లింక్ 2 పేరుతో పేదల భూముల లాక్కోన్నారని ఆరోపించారు. ఏఎంసీ చైర్మన్ సంతోష్, పార్టీ మండల అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.