కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయిండు : బాలూనాయక్

కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయిండు :  బాలూనాయక్
  • ఎమ్మెల్యే బాలూనాయక్

దేవరకొండ (కొండమల్లేపల్లి), వెలుగు : కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే బాలూనాయక్ విమర్శించారు. గురువారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వీఆర్ ఫుడ్ కోర్ట్, వాటర్ సర్వీసింగ్ సెంటర్లను ఆయన ప్రారంభించారు. 

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక కేటీఆర్​ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే సిరిసిల్లలో రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. 

సీఎం రేవంత్ రెడ్డిని రాజీనామా చేయాలనడం హాస్యాస్పదమన్నారు. సోషల్ మీడియా, పింక్ మీడియాను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఎవరేం చేసినా మళ్లీ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ  ధ్యేయమన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ కో–ఆర్డినేటర్ ఎంఏ సిరాజ్ ఖాన్, పీఏసీఎస్​ చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రేఖాశ్రీధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు వేమన్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.