
- ఎమ్మెల్యే బాలూనాయక్
దేవరకొండ (కొండమల్లేపల్లి), వెలుగు : గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని జానీతండాలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. కొండమల్లేపల్లి పట్టణంలోని వివిధ కాలనీల్లో రూ.90 లక్షలతో నిర్మించనున్న సీపీ రోడ్లు, మిషన్ భగీరథ ట్యాంక్ ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు.
అంతకుముందు దేవరకొండలోని క్యాంపు కార్యాలయంలో వివిధ మండలాలకు చెందిన173 మంది లబ్ధిదారులకు రూ.30 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్చెక్కులను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో పార్లమెంట్ కో–ఆర్డినేటర్ ఎంఏ సిరాజ్ ఖాన్, దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమునామాధవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరసింహ, పీఏసీఎస్ చైర్మన్ వేణుధర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు రేఖాశ్రీధర్ రెడ్డి, జానీయాదవ్, భవానీ పవన్ కుమార్, మండలాధ్యక్షుడు వేమన్ రెడ్డి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.