రఘువీర్ రెడ్డికి అఖండ విజయం అందిస్తాం : బత్తుల లక్ష్మారెడ్డి

  • ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి 

మిర్యాలగూడ, వెలుగు : మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డికి ఎంపీ ఎన్నికల్లో అఖండ విజయం అందించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని 3వ వార్డు తాళ్లగడ్డ, 36వ వార్డు సుందర్ నగర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వేములపల్లి మండల కేంద్రంలో ఉపాధి కూలీలను కలిసి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 

కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి 

నల్గొండ అర్బన్, వెలుగు : ఇండియా కూటమి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పబ్బు వీరస్వామి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని సతీశ్ నగర్ లో చెయ్యి గుర్తుకు ఓటు వేసి రాఘువీర్​రెడ్డిని గెలిపించాలని కోరారు. 

రఘువీర్ రెడ్డికే సంపూర్ణ మద్దతు.. 

నల్గొండ అర్బన్, వెలుగు : కాంగ్రెస్ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు లకుమాల మధుబాబు, రాష్ట్ర మహిళా కార్యదర్శి సప్పిడి సావిత్రి తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు ఆ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు కట్టెల శివకుమార్​ తెలిపారు. 

దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలి - 

సూర్యాపేట, వెలుగు : పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, దమ్ముంటే అభివృద్ధిపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చర్చకు రావాలని కాంగ్రెస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కందుకూరు రఘువీర్ రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం సూర్యాపేటలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్,  ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.