మిర్యాలగూడ, వెలుగు: మిర్యాలగూడలో త్వరలో.. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల బధిర విద్యార్థులు తయారు చేసి ఏర్పాటు చేసిన హ్యాండ్ క్రాఫ్ట్స్, స్టాల్ సందర్శించారు. బధిర విద్యార్థులకు ప్రముఖ హ్యాండ్ క్రాఫ్ట్ శిక్షకురాలు సందీప రెడ్డి ఇచ్చిన ట్రైనింగ్ తీరును ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే తమ వైఫల్యాలను ...దాటుకుంటూ ప్రతి ఒక్కరు సక్సెస్ వైపు అడుగులు వేయాలన్నారు. బధిర విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం గొప్పదన్నారు.