
- ఎమ్మెల్యే భూపతిరెడ్డి
సిరికొండ, వెలుగు: రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీప్రభుత్వం11ఏళ్లలో చేసింది ఏమీ లేదని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆరోపించారు. పలు శుభకార్యాల్లో పాల్గొనేందుకు సిరికొండకు వచ్చిన ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కులగణన విషయంలో రాష్ట్రం క్లారిటీతో ఉందన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, మండల అధ్యక్షుడు బాకారం రవి, నాయకులు ఎర్రన్న, గంగాధర్, సామెల్, గౌస్, నర్సారెడ్డి, రాములు, నర్సింగ్, తదితరులు ఉన్నారు.
రామాలయంలో విగ్రహా ప్రతిష్టాపన
ధర్పల్లి, వెలుగు: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని దమ్మన్నపేట్గ్రామంలో సుమారు రూ. 40 లక్షలతో నిర్మించిన రామాలయం నిర్మాణం, విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆదివారం హాజరయ్యారు. ఇంటింటికీ నిధులు సేకరించి దాతలు అందించిన నిధులతో కలిపి ఉత్సవాలను బ్రహ్మండంగా నిర్వహించారు.
ఎమ్మెల్యే, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు సుమన రవిరెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాల్రాజ్, జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య, సీనియర్‌కాంగ్రెస్ నాయకులు చెలిమెల శ్రీనివాస్, గాదరి మనోహర్‌రెడ్డి, గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్ల సుదర్శన్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామకమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.