ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
  • ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఖానాపూర్, వెలుగు: ప్రజాసేవే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కాంగ్రెస్ కార్యకర్తలు విస్తృత ప్రచారం చేపట్టాలని, ప్రజా ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టాలని ఖానాపూర్ ఎమ్మెల్యే  వెడ్మ బొజ్జు పటేల్ పిలుపునిచ్చారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఖానాపూర్, కడెం, పెంబీ, దస్తురాబాద్ మండలాల కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సిరి సంపదలు కలిగిన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ కుటుంబ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలన్నారు. దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలను గడప గడపకు తీసుకెళ్లి వివరించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్​పై వస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించేలా కృషి చేయాలన్నారు. కష్టపడే కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. 

కార్యక్రమంలో ఖానాపూర్, పెంబి కాంగ్రెస్ మండలాల అధ్యక్షులు దయానంద్, స్వస్పిల్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు నిమ్మల రమేశ్, ఖానాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ చిన్నం సత్యం, నాయకులు ఎ.రాజేందర్, యూసుఫ్ ఖాన్, తోట సత్యం, షబ్బీర్ పాషా, కిషోర్, సురేశ్, సతీశ్ రెడ్డి, సచిన్ తదితరులు పాల్గొన్నారు.