పేదల అనారోగ్యానికి సర్కారు ప్రయారిటీ : మట్టా రాగమయి

  • ఎమ్మెల్యే మట్టా రాగమయి

కల్లూరు, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు కృషి చేస్తోందని, అందులో భాగంగానే  ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పలు రకాల వైద్య సేవలు అందిస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి అన్నారు. గురువారం కల్లూరు మండల పరిధిలోని - పుల్లయ్య బంజర్ గ్రామం రూ.10.50లక్షలతో నిర్మించిన అంగన్​వాడీ భవనాన్ని ఆమె ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్​వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు గర్భిణులు, చిన్నారులకు ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తోందని తెలిపారు. అనంతరం పలువురి లబ్ధిదారులకు సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమం కల్లూరు ఏఎంసీ చైర్​పర్సన్​ భాగం నీరజాదేవి ప్రభాకర్ చౌదరి, తహసీల్దార్ పులి సాంబశివుడు, ఎంపీడీవో దయాగల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

తల్లాడ : రూ.62.55 లక్షల ఈజీఎస్ నిధులతో తల్లాడ, గొల్లగూడెం, నారాయణపురం గ్రామాల్లో సీసీ రోడ్లు, క్యాటిల్ షెడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే రాగమయి శంకుస్థాపన చేశారు.  తల్లాడ మేజర్ పంచాయతీ ఆఫీస్ లో సీసీ కెమెరాలు, రింగ్ సెంటర్ లో రిపేరు చేసిన వాటర్ ఫౌంటెన్ ఓపెన్ చేశారు. 

సత్తుపల్లి : సింగరేణి నిధులతో పట్టణ పరిధిలోని ద్వారకపురి కాలనీ రోడ్ నెంబర్ 7 లో మినరల్ వాటర్ ను ఎమ్మెల్యే రాగమయి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ  చైర్మన్ దోమ ఆనంద్, వైస్  చైర్ ​పర్సన్ తోట సుజాల రాణి, పట్టణ కౌన్సిలర్లు పాల్గొన్నారు.