సత్తుపల్లి, వెలుగు : ఐటీడీఏ సహకారంతో బోర్లు వేసుకున్న రైతులకు అవసరమైన విద్యుత్ మోటార్లను సింగరేణి సంస్థ సహకారంతో ఎమ్మెల్యే డాక్టర్ మట్టరాగమయి అందజేశారు. శుక్రవారం మండల పరిధిలోని సత్తెంపేట, బాసరం, కొమ్ముగూడెం, రుద్రాక్షపల్లి గ్రామాలకు చెందిన 30 మంది రైతులకు రూ.75 లక్షల విలువైన మోటార్లను ఎమ్మెల్యే అందజేశారు.
పీవో నరసింహ రావు, మాజీ ఎంపీటీసీ నాగజ్యోతి, కాంగ్రెస్ నాయకులు బత్తుల భరత్, భూపతిరెడ్డి, దామోదర్ రావు, అర్జున్, వెంకటేశ్వరరావు, వసంతరావు, రామారావు, కృష్ణ, సత్యం, గోపి, పాషా, హరికృష్ణ పాల్గొన్నారు.